Free medical camp | ఖాన్ పురలో ఉచిత మెగా వైద్య శిబిరం

Free medical camp | ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య పరీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) అన్నారు. ఖాన్ పురలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో సితార హాస్పిటల్ సౌజన్యంతో మహమ్మద్ జాఫర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని.. శిబిరాల ద్వారా ఆరోగ్య సమస్యలు ఉంటే బయటపడే అవకాశం ఉంటుందని అన్నారు.
మొదటి దశలోనే రోగ నిర్ధారణ జరుగుతే మందుల ద్వారా ఆరోగ్య సమస్యను పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉచిత మెగా శిబిరంలో 350 మందికి పైగా హాజరై వివిధ రకాల పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు మందులు తీసుకొని వెళ్లారు. ఈ వైద్య శిబిరం సితార హాస్పిటల్ ఎండి డాక్టర్ జాదవ్ రాజ్ కుమార్, డాక్టర్ వెంకట్ భరద్వాజ్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సమద్ నవాబ్, ముఫ్తీ మహమ్మద్ అలీమొద్దిన్, ఎంఎ కరీం ఖాద్రి,మహమ్మద్ రఫీక్, సయ్యద్ మాజిద్ ఫజల్, ఎంఎ ముజీబ్, జీడి రమేష్, షెహన్షా, శబానా మహమ్మద్, మసూమ్ ఖాన్, బషీర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
