Ayyappa | స్వామి పై భక్తితో..

Ayyappa | స్వామి పై భక్తితో..

Ayyappa, అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణం జూబ్లీనగర్ లోని ఉత్తర కోనేరు అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం వైభవంగా జరగనున్న శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు ఆదివారం నాడు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసి కార్యక్రమ విశేషాలను తెలియజేశారు.

మహా పడిపూజ నేపథ్యంలో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటుకు గాను ఎమ్మెల్యే వంశీకృష్ణ (MLA Vamsi Krishna) 50 వేల రూపాయల విరాళాన్ని అయ్యప్ప సేవా సమితి సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, గురుస్వాములు, పులిజాల రమేష్, శ్రీనివాసచారి, మహేష్ చారి, కేతేపల్లి వెంకటేష్, రామకృష్ణ, అయ్యప్ప స్వాములు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.