Ayyappa | ఘనంగా అయ్యప్పస్వామి పడి పూజ

Ayyappa | పెద్దమందడి, ఆంధ్రప్రభ : పెద్దమందడి మండలం దోడగుంటపల్లి గ్రామానికి చెందిన నారికేళ స్వామి చెన్నారెడ్డి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని చెన్నారెడ్డి స్వామిని సన్మానించారు. ఈ పూజా కార్యక్రమం గురుస్వాములు గోవిందరెడ్డి, ముత్తు కృష్ణ, కరకమలము లచే అత్యంత దేదీప్యమానంగా జరిగింది.

గణపతి హోమం, పల్లకిసేవ, కుంకుమార్చన అభిషేకం, అష్టోత్తరం మహపడిపూజ జరిగాయి. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ… 18 సార్లు మాల వేసుకొని శబరిమల యాత్ర చేయడం పూర్వజన్మసుకృతమని అన్నారు. అయ్యప్ప దీక్షలతో మానసిక ప్రశాంతత, ప్రజలలో భక్తిప్రభత్తులు, ఐకమత్యం పెంపొందుతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, గురుస్వాములు రఘుమారెడ్డి, కృష్ణసాగర్, నరేందర్, అశోక్ రెడ్డి, గట్టు శశి, పాపిరెడ్డి, అనిల్, రాకాసి శ్రీనివాస్ రెడ్డి, మేఘాశ్యం రెడ్డి, రామకృష్ణ గ్రామస్థులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.