nominations | కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ…

nominations | కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ…

nominations | రెంజల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో చివరి రోజైనా ఈ రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ నామినేషన్ల ప్రక్రియ పొటా పోటీగా నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ(Reception of nominations) కేంద్రంలో తమ ధ్రువీకరణ పత్రాలను అధికారులకు ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆసాని మంజుల అనిల్(Asani Manjula Anil) నామినేషన్ స్వీకరణ కేంద్రానికి వచ్చి వేశారు.

టీఆర్ఎస్ అభ్యర్థి తిరుపతి లలిత బుజ్జి నామినేషన్ల కేంద్రంలో దాఖలు చేశారు. బాజా బజంత్రీల మధ్య ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం నాగభూషణం రెడ్డి, మండల సీనియర్ నాయకుడు సాయిబాబాగౌడ్, మహిళా మండలి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, మాజీ సర్పంచులు చందూరు సవిత, ఆసాని లచ్చన్న, ఎఎంసి డైరెక్టర్ కుర్మ శీను, నాయకులు సాయ గౌడ్, సగ్గు వెంకటి, సిహెచ్ సాయన్న, టిఆర్ఎస్ తరపున టిఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ రఫీ, తిరుపతి బుజ్జి, తిరుపతి రాము, పిల్లి రాజయ్య, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply