Nomination | బారులు తీసిన అభ్యర్థులు

Nomination | బారులు తీసిన అభ్యర్థులు
Nomination | రెంజల్, ఆంధ్రప్రభ : మండలంలోని సాటాపూర్ క్లస్టర్ కేంద్రం వద్ద నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు బారులు తీశారు. క్లస్టర్ కేంద్రం(Cluster center) పరిధిలోని గ్రామాలు బోర్గాం, సాటాపూర్, తాడ్ బిలోలి, మౌలాలి తాండ ఉన్నాయి. నామినేషన్లకు చివరి రోజైనా ఈరోజు సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్(Nomination) వేసేందుకు బారులు తీశారు. క్లస్టర్ కేంద్రం పరిధిలోని అధిక గ్రామాల్లో ఉన్నందువలన నామినేషన్లకు క్యూ పద్ధతి పాటించారు.
ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు కేంద్రంలో నామినేషన్ ఫారాలు అధికారుల(Officers)కు అందించి, ఒక్కొక్కటిగా నామినేషన్ పత్రాలను నమోదు చేయించుకుంటున్నారు. నామినేషన్ ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పంచాయతీ ఎన్నికల్లో యువతుల పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో యువతి, యువకులు సైతం ఎన్నికల బారిలో దిగుతున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో ప్రముఖులు(Celebrities) కొన్నిచోట్ల బరిలో దిగుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ చాలా ఆలస్యం అయ్యే పరిస్థితులు నెలకొన్నట్టు ఉన్నాయి.
