MPTC, ZPTC | స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

MPTC, ZPTC | స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి

MPTC, ZPTC | మక్తల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యులు, సర్పంచులతో పాటు రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ(MPTC, ZPTC) ఎన్నికలను సత్తా చాటాలని మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య(Kondaiah) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కొండయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలకు చిల్లి గవ్వ ఇవ్వలేదని కేంద్రం నిధులతోనే పనులు జరుగుతున్నాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం(Central Government) పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వల్లే డ్రైనేజీలు, మురుగునీరు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు రావాలంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. కేంద్రం నిధులతోనే పంచాయతీలు అభివృద్ధి సాధ్యమని అందుకే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీలను బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పార్టీ కార్యకర్తలు(Party cadres) క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల మద్దతు ఉన్న వారినే కాకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కొండయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కే .సోమశేఖర్ గౌడ్, మజ్జిగ సురేష్, దాదన్ పల్లి ప్రతాపరెడ్డి, కుర్వ హనుమంతు, అశోక్ గౌడ్, నల్లె నరసప్ప, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.