Makthal | రథోత్సవం..

Makthal | రథోత్సవం..

  • బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయం..
  • 4న శ్రీ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం..
  • ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య శ్రీ రామాలయం అలంకరణ..

Makthal, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల కోసం ఆలయం ముస్తాబవుతుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయం వద్ద పట్టణంలోని ప్రధాన రహదారులకు రంగురంగుల విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు, శ్రీరాముడు, ఆంజనేయుడు, సీతారామ లక్ష్మణులు, వెంకటేశ్వర స్వామి, జాంబవంతులు వంటి దేవత మూర్తుల విగ్రహాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయం ముందు భాగంలో 60 అడుగుల రాజగోపురం.. అదే విధంగా అయోధ్య రామమందిరం శ్రీరాముడి అలంకరణ పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది.

డిసెంబర్ 2న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్త పి. ప్రాణేశాచారి తెలిపారు. మూడున ప్రభోత్సవం, నాలుగున రథోత్సవం, ఐదున పాలవుట్లు, తొమ్మిదవ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply