25.91 percent | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై శిక్షణ
25.91 percent | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై శిక్షణ
- కలెక్టర్ ఆనంద్
25.91 percent | అనంతపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సచివాలయంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ రోజు ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ మ్యాపింగ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special intensive revision) – 2026 కోసం సన్నాహక కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, డీఆర్ఓ ఏ.మలోల, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ కనకరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓ(EROs, AERO)లు, ఈడీటీలు, ఈఎస్ఏలకు ఈనెల 25వ తేదీన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – 2026పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో ఓటర్ మ్యాపింగ్‌కు సంబంధించి 25.91 శాతం(25.91 percent) పూర్తి చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో 330 నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఓలను నియమించడానికి ప్రతిపాదనలు వెంటనే పంపిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో అందరూ బీఎల్ఓలకు ఐడీ కార్డు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, టెక్నికల్ అసిస్టెంట్ శివ పాల్గొన్నారు.
