Ayyappa|మారు మ్రోగిన మదనంతపురం..

Ayyappa|తుగ్గలి, ఆంధ్రప్రభ : అయ్యప్ప నామ స్మరణముతో మదనంతపురం మారు మ్రోగిపోయింది. బుధవారం గ్రామంలో అయ్యప్ప స్వాములు “స్వామియే శరణం అయ్యప్ప” అని జపిస్తూ వినాయకుడికి, గురు స్వామికి అభిషేకం చేశారు. అయ్యప్ప స్వామి ను పండ్లతో, పూలతో అలంకరించారు. అప్పం, పాయసం వంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టారు. అయ్యప్ప స్వామికి 16 రకాలైన ఆర్చనలతో పూజలు చేశారు.స్వామికి హారతి ఇచ్చి, ప్రదక్షిణలు చేసి పూజను ముగించారు. అనంతరం గ్రామంలో అయ్యప్ప స్వామి చిత్రపటాన్ని ఊరేగింపు నిర్వహించారు. గ్రామానికి చెందిన అల్లాగే వల్లాగి భరత్ స్వామి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలో అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా గురు స్వామి కావలి నాగేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప స్వామి శరణం అంటూ నినాదాలతో భక్తులు ఊరేగింపులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు స్వామి కావలి నాగేష్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందువల్ల ప్రతి ఒక్కరు భక్తి భావాలు కలిగి అయ్యప్ప శరణం స్వామి అనే స్మరించుకుంటూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వాములు అనుమన్న, గోవిందు, మహదేవ, భరత్, శేఖర్ స్వాములు పాల్గొన్నారు.
