Tekumatla | రాజ్యాంగతోనే సమాన అవకాశాలు..

Tekumatla | రాజ్యాంగతోనే సమాన అవకాశాలు..
మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్
Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : దేశంలో అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్ (Donthula Srinivas) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం టేకుమట్ల మండల కేంద్రంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరిగాయి.
టేకుమట్ల (Tekumatla) మండలంలో అంబేద్కర్ యువజన సంఘం భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ అరకొండ రాజయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దొంతుల శ్రీనివాస్ హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ… అణగారిన వర్గాలకు ముఖ్యంగా దళిత, గిరిజన, బహుజనులకు రిజర్వేషన్లు (Reservations), అణగారిన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వాన్ని కల్పించి వారి అస్తిత్వాన్ని నిలబెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు మార్గదర్శకుడైన ఆ మహనీయున్ని స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మారపల్లి కొమురయ్య, అంబాల రమేష్, అబ్బేంగుల రాజయ్య, రాకేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
