Ichoda | ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి..

Ichoda | ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి..

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…


Ichoda | ఇచ్చోడ, ఆంధ్రప్రభ : చిన్ననాటి నుంచి ప్రతి విద్యార్థి (student) ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్లినట్లయితే జీవితంలో పైకి ఎదుగుతారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan) అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విద్యాలయ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యత ఉండాలన్నారు.

మొక్కై వంగనిది మానై వంగునా అనే నానుడి ప్రకారం ప్రతి విద్యార్థి (student) చిన్ననాటి నుంచి చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యత సాధించాలని, చిన్ననాటి నుంచే మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్లినట్లయితే దానిని మనం పరిపూర్ణత సాధించవచ్చన్నారు. ముఖ్యంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినట్లయితే వెంటనే 100డైల్స్ కు కాల్ చేసినట్లయితే షీ టీం మీ ముందర ఉంటుందని ఎలాంటి సమస్యనైనా మీరు అధైర్య పడకుండా పోలీసులకు తెలియజేసినట్లయితే దానిని త్వరగా పరిష్కార మార్గం చూపెట్టి మీలో ధైర్యాన్ని నింపుతామన్నారు.

ప్రపంచంలోనే మన రాజ్యాంగం చాలా బలమైనదని ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సమాన హక్కులు లభిస్తాయని దీనిని దీనిపైన ప్రతి విద్యార్థి పూర్తి అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు లభిస్తాయని, దీనిపైన ప్రతి విద్యార్థి పూర్తి అవగాహన (Full understanding) పెంచుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిచ్చోడా సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రాజుతోపాటు విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ మారా లయ శ్యామ్ రెడ్డి తోపాటు ప్రిన్సిపాల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply