Utkoor | 19వసారి రక్తదానం

Utkoor | 19వసారి రక్తదానం

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ (Utkoor) మండల కేంద్రంలోని శ్రీకృష్ణ నగర్ వీధికి చెందిన శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతాన్ పల్లి శివ ప్రసాద్ రెడ్డి (Siva Prasad Reddy) ప్రాణాపాస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలను నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ దౌల్తాబాద్ మండల పరిధిలోని గుండెపల్లి గ్రామనికి చెందిన లింగమ్మ గుండెను చికిత్స నిమిత్తం హైదరాబాద్, లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా.. అక్కడి వైద్యులు రక్తం కావాలని కుమారుడు విజయ్ ఏ ప్లస్ పాజిటివ్ రక్తం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఊట్కూర్ (Utkoor) గ్రామానికి చెందిన శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతనపల్లి శివప్రసాద్ రెడ్డికి సమాచారం ఇవ్వగా స్పందించి, హైదరాబాద్ కేంద్రంలోని పంజాగుట్ట నీమ్స్ ఆసుపత్రికి స్వచ్ఛందంగా వెళ్ళి 19వ సారి రక్తదానం చేసి పలువురి మన్ననలు పొందుతున్నాడు. ప్రమాదంలో ఉన్నవారికి తమ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతామని, రక్తం కావలసినవారు 9398615170, నెంబర్ ను సంప్రదించాలని కోరారు. శివప్రసాద్ రెడ్డి 19వ సారి రక్తదానం చేయడంతో పలువురు అభినందిస్తున్నారు.

Leave a Reply