Andhra king taluka | ఇది వేరే లెవెల్..
Andhra king taluka | ఇది వేరే లెవెల్..
Andhra king taluka, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Hero Ram) నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్బస్టర్లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా పై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బాబు పి (Director Mahesh babu p) చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. ఈ టైటిల్ కి చాలా మీనింగ్ ఉందని.. అది ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది అన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2002 టైం లో జరుగుతుంది. అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి అలా పెట్టడం జరిగింది అన్నారు. కన్నడలో కూడా ఈ సినిమాని ఇదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నామని తెలియచేశారు. ఈ సినిమాకి ముందుగా ఆంధ్ర కింగ్ పేరు పెట్టుకున్నానని.. ఒక సీన్ రాస్తున్నప్పుడు అందులో ఎవరి తాలూకా అని డైలాగ్ వస్తుంది. అప్పుడు హీరో తన ఐడెంటిటీ గా ఫీల్ అవుతున్న ఎమోషన్ ని ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టడం జరిగిందని చెప్పారు.
రామ్ గారు చాలా వెర్సటైల్ యాక్టర్. ఆయన క్యారెక్టర్ లో పెర్ఫార్మెన్స్ లో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి. ఒక ఫ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడో ఎంత మాస్ గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మర్ కావాలి. ఇలాంటి క్యారెక్టర్ కి రామ్ గారు పర్ఫెక్ట్. ఈ సినిమాకి రామ్ గారు అద్భుతమైన వేవ్ లెంత్ లో వర్క్ చేసారు. ఇంకా చెప్పాలంటే.. ఇద్దరం ఒకటే అన్నట్టుగా పని చేసాం. ఇప్పటి వరకు రామ్ గారు చేసిన సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు. ఈ మాట హానెస్ట్ గా చెప్తున్నాను. ఆయన కంఫర్ట్ లెవల్ ని దాటి ఈ సినిమాని చేశారు. ఆయన ఈ క్యారెక్టర్ ఇంత అద్భుతంగా చేయడానికి ఆయన ఫ్యాన్స్ ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది అని డైరెక్టర్ మహేశ్ బాబు పి తెలియచేశారు.
