Telangana | ఇందిరమ్మ రాజ్యం అంటేనే..

Telangana | ఇందిరమ్మ రాజ్యం అంటేనే..
Telangana | కట్టంగూర్, ఆంధ్ర ప్రభ : ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Nakirekal MLA Vemula Veeresham) అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మండలానికి సంభంధించిన ఇందిరా మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. కొద్దిగా ఆలస్యమైనా తెలంగాణ ఆడబిడ్డలకు నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారని.. దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణి చేస్తున్నామని చెప్పారు. స్యయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు.
మహిళలను (Women) ఆర్థిక బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధిని మాత్రం జీరో చేశారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికీ బాసటగా నిలిచి గ్రామాలు మరింత అభివృద్ధి వైపు పయనించేలా మనకు మనమే తోడ్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డిఓ ఆశోక్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
