KARATE | ప్రతిభకు పట్టం..

అండర్–14 కరాటే పోటీలలో ప్రతిభ
KARATE | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ) లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి జాడి శ్రేయాన్స్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యాడు. శ్రేయాన్స్ ఈ నెల 3వ తేదీన మంచిర్యాలలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన జోన్‌ల స్థాయి అండర్–14 కరాటే పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించాడు.
ఈ సందర్భంగా ఆదివారం స్కూల్ ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన శ్రేయాన్స్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి అండర్–14 కరాటే పోటీలు వికారాబాద్ జిల్లా మణిపేట్‌లోని జేకేఆర్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా మంచిర్యాల జిల్లా ఎస్‌జిఎఫ్ కార్యదర్శి ఎండి. యాకూబ్ కూడా శ్రేయాన్స్‌ను అభినందించారు.
రాష్ట్ర పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, సీనియర్ ఉపాధ్యాయులు దశరథం, కొండల్‌రావు, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ పాల్గొన్నారు.
