FAMILY| బాధిత కుటుంబానికి అండగా ఉంటా..

FAMILY| బిక్కనూర్, ఆంధ్రప్రభ: బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కందునూరి శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఇటీవల ఆయన తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధ్యత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఆయన వెంట గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలకిషన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
