Maoist Letter : బెజవాడలో దొరికాడు

Maoist Letter : బెజవాడలో దొరికాడు

  • లొంగుబాటును ఒప్పుకోలేదు
  • చంపేసి ఎన్​ కౌంటర్​ కథ చెప్పారు
  • అభివృద్ధి పేరుతో సహజ సంపద దోపిడీ
  • కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు
  • యుద్ధోన్మాదం రెచ్చగొడుతున్నారు
  • ఎన్నికల సంఘం మోడీకి బానిస
  • రండి పోరాటాల్లో కలవండి
  • మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్​ ప్రకటన

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి )

 ఆర్‌ ఎస్‌ ఎస్,  బీజేపీ (Rss , Bjp),  మనువాది ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను (Facist Polacy)  అమలు చేస్తోంది.  నిరంతరం హత్యలతో భయాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తోంది,  కార్పొరేట్ కంపెనీల   కోసం ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం ఈ హత్యలను నిర్వహిస్తోంది, అని మావోయిస్టు పార్టీ (Maoist Party)  ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మారేడుమిల్లి అడవిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యు మాడ్వి హిడ్మా ఎన్ కౌంటర్​ పై తాజాగా లేఖను విడుదల చేసింది.

 Maoist Letterవిజయవాడలో దొరికితే చంపేశారు

 వైద్య పరీక్షల కోసం విజయవాడ వెళ్లిన హిడ్మాను ఓ ద్రోహి (Betrayal)  పట్టించారని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ Maoist Party Spokes Person)  ​ వివరించారు.  అభయ్​ తెలిపిన సమాచారం మేరకు,   దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి,  కేంద్ర కమిటీ సభ్యుడు   హిడ్మా (CCM  HIDMA)  కలిసి  వైద్య చికిత్స కోసం కొంతమందితో కలిసి  విజయవాడ (Vijayawada)  నగరానికి వెళ్ళారు. చికిత్స సమయంలో (Helth Treatment)   కొందరి ద్రోహంతో హిడ్మా బృందం  సమాచారం పోలీసులకు తెలిసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) పోలీసులు నవంబర్ 15న (Arrested)  ఈ బృందాన్ని  అరెస్టు చేశారు. లొంగిపోవటానికి (Surrender)  ప్రయత్నించినా  దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత మారేబునిల్లి అడవిలో   ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు  నివేదించారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని,  ఎన్‌కౌంటర్‌లో  ఆరుగురు మరణించారని చెబుతున్న వాదనలు (Fake)  పచ్చి అబద్ధాలు, అని అభయ్​ వివరించారు.

Maoist Letterవిప్లవ వీరులకు లాల్​ సలామ్​  

విప్లవ స్ఫూర్తిని ఉద్ధరించి , సైద్ధాంతిక బలాన్ని ప్రదర్శించిన   హిడ్మాకు సీపీఐ (మావోయిస్టు) వినయంగా నివాళులర్పిస్తుంది.  చివరి శ్వాస వరకు ఉద్యమంలో   తన విలువైన ప్రాణాలను త్యాగం చేసిన  ఏవోబీ  రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్,  రాజే కి అభయ్​ తన లేఖలో నివాళి ప్రకటించారు.  PPCMembers , చైతు,   కమలు ,  మల్లాల్​,  దేవే   తమ విధి నిర్వహణలో తమ విలువైన విజయాలను త్యాగం చేసిన ఈ సహచరులందరికీ మావోయిస్టు పార్టీ నివాళి అర్పించినట్టు అభయ్​ వివరించారు.

Maoist Letterఅభివృద్ధి పేరిట దోపిడీ

అభివృద్ధి పేరుతో దేశ సంపదను, సహజ వనరులను కార్పొరేట్​ సంస్థలకు ఆర్‌ఎస్‌ఎస్, -బీజేపీ , మనువాది శక్తులు అప్పగిస్తున్నాయని అభయ్ (Abhay) ​ ఆరోపించారు. ఈ దోపిడీకి  వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని,  ఈ మనువాది శక్తులు ఈ ఉద్యమాలను కుట్రలుగా తప్పుదారి పట్టించి అణిచివేస్తున్నాయని అభయ్​ పేర్కొన్నారు.      

Maoist Letterమోదీకి ఎన్నికల కమిషన్​ బానిసత్వం

మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని, మోసపూరిత నినాదాలు, పథకాలను ప్రవేశపెట్టి  ప్రజలను మోసం చేస్తున్నారని అభయ్​ ఆరోపించారు.  రాజ్యాంగ సంస్థలను తమ నియంత్రణలో ఉంచుకున్నారని, ఎన్నికల కమిషన్ మోడీకి బానిసగా మారిందన్నారు. మొత్తం అధికార వ్యవస్థను తమ నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా, వారు భారీ మోసం ద్వారా బీహార్ ఎన్నికలను గెలిచారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను నిర్మూలించి,     పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను (Demolishing Denocracy)  కూల్చివేసే ప్రణాళికను వారు అమలు చేస్తున్నారు.

పోరాటాలకు పిద్ధం కండి కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు అన్ని సామాజిక వర్గాలు CPI (మావోయిస్టు) నాయకుడు హిడ్మా  సాహసోపేత యుద్ధ కమాండర్ల చరిత్ర నుంచి  ప్రేరణ పొంది, కుళ్ళిపోయిన వ్యవస్థను నిర్మూలించే అంతిమ లక్ష్యంతో ఫాసిస్ట్ RSS, -BJP మనువాదులకు   వ్యతిరేకంగా పోరాటంలో చేరాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్​  అభ్యర్థించారు. 

Leave a Reply