RALLY | మర్రిపూడిలో అన్నదాత సుఖీభవ ర్యాలీ
RALLY | మర్రిపూడి, ఆంధ్రప్రభ : పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు విడుదల సందర్భంగా రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి డీఎస్ బీవీ స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో వారు స్వయంగా ట్రాక్టర్ నడిపారు. అనంతరం మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని.. అన్నదాత సుఖీభవ కింద 46.86 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో రూ. 6,310 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద అన్నదాతకు రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాడు జగన్ రైతు భరోసా రూ.13,500 ఇస్తానని చెప్పి కేవలం రూ. 7 వేలు ఇచ్చి రైతుల్ని మోసం చేశారని అన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటున్నారన్నారు. అన్నదాతల కుటుంబాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదమని చెప్పారు.
