Fire | జిన్నింగ్ మిల్లులో ఇద్ద‌రు కార్మికులు స‌జీవ‌ద‌హ‌నం

Fire | జిన్నింగ్ మిల్లులో ఇద్ద‌రు కార్మికులు స‌జీవ‌ద‌హ‌నం

  • మరో ఇద్దరికి గాయాలు

Fire | జడ్చర్ల, ఆంధ్రప్రభ : జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లు(Salasar Balaji Ginning Mill)లో ఈ రోజు జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ దహనమ‌య్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని జిన్నింగ్ మిల్లులో ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది కార్మికులు నిత్యం పనిచేస్తుంటారు. బయటికి గాలి చేరే పైపులో చెత్త ఇరుక్కుందని తెలుసుకున్న పప్పు (26) (ఒడిశా), హరేందర్ (23) (బీహార్) రాష్ట్రాల‌కు చెందిన ఇద్దరు కార్మికులు దానిని తొలగించేందుకు లోపలికి వెళ్లారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న మంటలు ఒక్కసారిగా వారికి తగలడంతో వారు అక్కడికక్కడే అగ్ని(Agni)కి ఆహుతి అయ్యారు.

ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులు(Workers) తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరికీ ఇటీవలే వివాహం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు. అగ్ని ప్రమాదం అనంతరం బీహార్, ఒడిశా(Bihar, Odisha) రాష్ట్రాలకు చెందిన కార్మికులు మిల్లు యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికక్కడే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు.

Leave a Reply