Youth | పేర్లను గోప్యంగా ఉంచుతాం…
Youth | పేర్లను గోప్యంగా ఉంచుతాం…
- సమిష్టిగా నివారిద్దాం.. ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడుదాం..
- కురవి ఎస్సై గండ్రాతి సతీష్..
Youth | కురవి, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమవుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని కురవి ఎస్ ఐ గండ్రాతి సతీష్(SI Gandrathi Satish) అన్నారు. ఈ రోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఆలయ సెంటర్(Temple Centre) లో ప్రజలకు మాదకద్రవ్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్(Future of Youth) నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా(supply of drugs) చేసేవారి ఆట కట్టించడానికి సిద్ధంగా ఉన్నామని, డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానం వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని కోరుతూ ప్రజలతో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అవేరే మోహన్ రావు(Avere Mohan Rao), మండల ఉపాధ్యక్షుడు, ఆలయ ధర్మకర్త బాలగాని శ్రీనివాస్, నల్లెల బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నిమ్మలగంటి కృష్ణమూర్తి, దడిగల నరసయ్య, పోలీస్ సిబ్బంది గాడిపెల్లి అనిత, హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, వీరన్న, సుధాకర్ లు, ఆటో యూనియన్ సభ్యులు బోడ లచ్చు, నాగబాబు, పాశం సంపత్, లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
