Kurnool | జీజీహెచ్ కి ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు..

- పరిపాలన బలోపేతానికి నిర్ణయం
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలనను మరింత పటిష్టం చేయడానికి ఇద్దరు సీనియర్ అధ్యాపకులను డిప్యూటీ సూపరింటెండెంట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు ప్రకటించారు.
సైకియాట్రీ విభాగం ప్రొఫెసర్ & హెచ్ఓడి డా.ఎన్.నాగేశ్వరరావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డా.ఎస్.లక్ష్మీబాయిలను డిప్యూటీ సూపరింటెండెంట్లుగా నియమించినట్టు తెలిపారు.
ఆసుపత్రి పరిపాలన మరింత వేగవంతం కావడం, విభాగాల మధ్య సమన్వయం పెరగడం, రోగులకు సమర్థవంతమైన సేవలు అందించడంలో ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
కొత్తగా నియమితులైన డిప్యూటీ సూపరింటెండెంట్లు ఈ బాధ్యతలు అప్పగించినందుకు సూపరింటెండెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.నాగేశ్వరరావు, డా.లక్ష్మీబాయి, ఆర్ఎంవో డా.వెంకటరమణ, అసోసియేట్ ప్రొఫెసర్ డా.శివబాల తదితరులు పాల్గొన్నారు.
