POLICE | ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు స‌స్పెన్ష‌న్‌

POLICE | ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు స‌స్పెన్ష‌న్‌

POLICE | ఆదిలాబాద్  ఆంధ్ర‌ప్ర‌భ : ఆదిలాబాద్ జిల్లా  బోత్ పోలీస్ స్టేషన్ (Police Station) నుండి  ఓ నిందితుడు పరారైన ఘటనలో  ఏఎస్ఐ, ముగ్గురు పోలీసులపై వేటుపడింది. గత పది రోజుల కిందట  సోనాల మండలం కోట- కె గ్రామానికి చెందిన కాంబ్లే మారుతి అని ఇందిరమ్మ లబ్ధిదారున్ని బిల్లుల విషయంలో గుత్తేదారు సత్యనారాయణ చేతు లు కట్టేసి నిలదీసిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనలో నిందితుడు గుత్తేదారు సత్యనారాయణ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని స్టేషన్‌లో ఉంచగా త‌ప్పించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఎస్పీ విచారణ జరిపి బాధ్యులైన ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో బోత్ ఏఎస్ఐ ధారాసింగ్ (Dharasingh) హెడ్ కానిస్టేబుల్ శివాజీ, కానిస్టేబుల్ అశోక్ ఉన్నారు.

Leave a Reply