SBI BIG ALERT | వచ్చే నెల నుంచి ఆ సేవలు బంద్…

ఆంధ్రప్రభ : ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 30 తర్వాత MCASH సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఫలితంగా, ఇకపై ఆన్లైన్ లేదా యోనో లైట్ యాప్ ద్వారా డబ్బు పంపడం, క్లెయిమ్ చేయడం వంటి సేవలు MCASH ద్వారా అందుబాటులో ఉండవు.
మనీ ట్రాన్స్ఫర్ కోసం UPI, IMPS, NEFT, RTGS వంటి డిజిటల్ చెల్లింపు సేవలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది.
లబ్ధిదారుడిని రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు పంపే వీలును కల్పిస్తూ MCASH సేవను SBI గతంలో ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ సేవ నిలిపివేయడంతో, కస్టమర్లు ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. సంబంధిత మార్పులపై SBI త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశముంది.
