W.Godavari | దొంగ దొరికాడు…..

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ఇల్లు అద్దెకు కావాలని నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాల మోహన్ లక్ష్మీ సాయి అనే వ్యక్తి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామీణ పోలీసులు .

ఇటీవల భీమవరం మండలంలోని కొవ్వాడ పుంత, నరసింహపురం గ్రామాల్లో చోరీలు చోటుచేసుకున్నాయి. కాలువ ధనలక్ష్మి అనే మహిళ ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్ళగా, మధ్యాహ్నం సమయంలో తాళాలు పగలగొట్టి 12 కాసుల బంగారం దొంగిలించారు.

పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిఘా పెట్టి మోహన్ లక్ష్మీ సాయిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను భీమవరంలో మరో రెండు చోట్ల కూడా చోరీలకు పాల్పడినట్లు వెల్లడించింది.

పోలీసులు అతని వద్ద నుండి సుమారు రూ. 18 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 1 లక్ష విలువైన వెండి వస్తువులు, అలాగే ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ జయసూర్య అభినందించి రివార్డులు అందజేశారు.

Leave a Reply