- రికార్డ్ స్థాయిలో ఆదాయం..
- రూ 2.67 కోట్లు కానుకలు సమర్పించిన భక్తులు..
- పెద్ద ఎత్తున బంగారం వెండి విదేశీ డాలర్లు కానుకలు..
ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలను సమర్పించారు. దేవస్థానంలో 15 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనా నాయక్ పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులో నిర్వహించిన ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో 49 హుండీలలోని 120 సంచులను తెరిచి లెక్కించారు.
ఈ హుండీ లెక్కింపు సందర్భంగా…
నగదు: రూ. 2,67,93,738/-, బంగారం: 215 గ్రాములు, వెండి: 3 కిలోల 320 గ్రాములను భక్తులు సమర్పించారు.
అలాగే విదేశీ కరెన్సీ యుఎస్ఏ డాలర్లు 403, సింగపూర్ డాలర్లు 16, కెనడా డాలర్లు 25, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ దిర్హమ్స్ 115,సౌదీ రియాల్స్ 5,ఒమన్ పైసా 285, ఒమన్ రియాల్స్ 22, ఖతార్ రియాల్స్ 10,కువైట్ దీనార్ 14,ఆస్ట్రేలియా డాలర్లు 10,ఇంగ్లాండ్ పౌండ్స్ 10, థాయిలాండ్ బాట్స్ 20 ఉన్నాయి.
ఈ లెక్కింపు ప్రక్రియను ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ట్రస్ట్ బోర్డు సభ్యులు సుకాసి సరిత, టి.రమాదేవి, పద్మావతి ఠాకూర్, కళావతి, రాఘవరాజు, హరికృష్ణ పర్యవేక్షించారు.

