Collector | నాణ్యమైన భోజనం అందించాలి
కలెక్టర్ ఆధ్వయిత్ కుమార్ సింగ్
నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ (Collector) ఆధ్వయిత్ కుమార్ సింగ్ (Aadhvait Kumar Singh) అన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ ఆధ్వయిత్ కుమార్ సింగ్ బుధవారం నెల్లికుదురు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులను పరిశీలించారు.
అనంతరం కేజీబీవీ పాఠశాల (KGBV School) లో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవన్నారు. మెనూ పాటించాలన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సూచనలు ఇచ్చారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. కాంటాలు నిర్వహించడంలో జాప్యం జరుగోద్దన్నారు. తహసీల్దార్ చందా నరేష్, సిబ్బంది, తదితరులు వున్నారు.

