ఇంటికొక పారిశ్రామికవేత్త లక్ష్యం…

ఇంటికొక పారిశ్రామికవేత్త లక్ష్యం…
పశ్చిమ ప్రకాశం బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా MSMEలను ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేర్కొన్నారు. కనిగిరి నియోజకవర్గం లింగన్నపాలెం గ్రామంలో APIIC ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన MSME పార్కును ఆయన ప్రారంభించారు.
కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (Ugranarasimha Reddy), ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజబాబు, APIIC చైర్మన్ రామరాజు, జిల్లా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఇంటూరి నాగేశ్వరరావు, బిన్ విజయకుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోకరెడ్డి, జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, లంక దినకర్, మరరెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమశ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బొల్లా నరసింహారావు, వేమూరి రామయ్య, నూడా చైర్మన్ రియాజ్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సభలో చంద్రబాబు మాట్లాడుతూ…. 175 నియోజకవర్గాల్లో రూ.5 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (industries) స్థాపించనున్నట్టు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించి అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం కోసం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఉద్యోగం చేసె వాళ్ళు ఇతరులకు ఉద్యోగం కల్పించే స్థాయికి తీసుకురావడం కోసం ప్రణాళికలు (Plans) సిద్ధం చేసుకోవాలని యువతకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తామన్నారు.
ఇప్పటికే ఉన్న వ్యాపారులను భవిష్యత్తు పారిశ్రామికవేతలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. విద్యార్థులు సొంత ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేలా పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

