అది.. అందెశ్రీ ప్రతిభకు నిదర్శనం..

అది.. అందెశ్రీ ప్రతిభకు నిదర్శనం..

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ తెలంగాణ” రచయిత, కవి అందెశ్రీ (Andhe Sri) ఆకస్మిక మరణం పట్ల నారాయణపేట జిల్లా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో సంతాప సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం మంగళవారం పతంజలి యోగా సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభంలో అందెశ్రీ స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు.

అనంతరం పతంజలి యోగా సమితి, యోగా గురువు సురేష్ మాట్లాడుతూ… అందెశ్రీ గారు వరంగల్ జిల్లా మద్దూరు గ్రామానికి చెందినవారని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి గొర్రెల కాపరిగా, తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తూ కష్టపడి ఎదిగారని తెలిపారు. చదువు మధ్యలోనే నేర్చుకుని, మన రాష్ట్ర గర్వకారణమైన “జయ జయ తెలంగాణ” గీతాన్ని రచించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని ఆయన అన్నారు.

అదే విధంగా “జై బోలో తెలంగాణ” (Jail Bolo Telangana) సినిమాకు పాటలు రాయడమే కాక, తెలంగాణ ఆవిర్భావం, సంస్కృతి గురించి ఎన్నో పాటలు రచించి ప్రజల్లో తెలంగాణ స్పూర్తిని నింపారని సురేష్ తెలిపారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం “జయ జయ తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించగా, ఆ ఆనందంలోనే అందెశ్రీ గారి మరణం బాధాకరమని పేర్కొన్నారు. చివరగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply