ఘనంగా రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలు ప్రారంభం

పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 58వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్-డిస్ట్రిక్ట్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పోటీలను ప్రారంభించారు.

మూడు రోజులపాటు కొనసాగే ఈ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి 11 పురుషుల జట్లు, 10 మహిళా జట్లు పాల్గొంటున్నాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని, విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో బొద్దుల గంగయ్య, జిల్లా యువజన–క్రీడాధికారి సురేష్, ఉద్యోగ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్, జిల్లా ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల కుమార్, కార్యదర్శి టి. లక్ష్మయ్య, జిల్లా పెటా సంఘం అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల సురేందర్, ఖో-ఖో సంఘం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ భూపెల్లి నారాయణ, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply