ఆలయ సిబ్బంది నిజాయితీ..

ఆలయ సిబ్బంది నిజాయితీ..

బాసర, ఆంధ్ర ప్రభ – బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయానికి శుక్రవారం హైరాదాబాద్ కు చెందిన ఓ భక్తుడు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన భక్తురాలు వచ్చారు అమ్మవారి దర్శనం అనంతరం.. తిరుగు ప్రయాణంలో ఆలయం వద్ద మహారాష్ట్రకు చెందిన భక్తురాలు సావిత్ర భాయి మొబైల్ తో హ్యాండ్ బ్యాగ్ ను మర్చిపోయింది. హైదరాబాద్ చెందిన భక్తుడు ప్రవీణ్ అక్షరాభ్యాస మండపంలో విలువైన గోల్డ్ రింగ్ ను పోగొట్టుకున్నారు. అయితే.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ వాగ్దేవి సొసైటీ సిబ్బంది రాజు, హోంగార్డులు ఇందల్, నారాయణ ఆలయంలో అనౌన్స్మెంట్ చేయించారు. భక్తులు మర్చిపోయిన సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్, రింగును ఆలయ ఇన్స్పెక్టర్ సురేష్ భక్తులను పిలిపించి అందజేశారు. విధుల్లో నిజాయితీగా వ్యవహరించిన రాజును హోంగార్డ్ నారాయణ, ఇంధల్ ను భక్తులు, స్థానికులు అభినందించారు.

Leave a Reply