IND vs ENG – ODI | రేపటి నుంచి వన్డే సమరం..
- నాగపూర్ లో ఇంగ్లండ్ తో ఢీ
- రోహిత్, కోహ్లీలపై పైనే అందరి కన్ను
- వన్డే సిరీస్ గెలవాలనే పట్టుదలలో ఇంగ్లండ్
- ఛాంపియన్ ట్రోఫీకి ముందు కీలక మ్యాచ్ లు
నాగపూర్ : ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. అప్‌కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది . సిరీస్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..? గురువారం నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇరు జట్లకు ఇదే చివరి వన్డే సిరీస్ కావడంతో సన్నాహకంగా ఉపయోగించుకోనున్నాయి. టీమ్ కాంబినేషన్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో అనుసరించిన వ్యూహాలను ఈ సిరీస్‌లో పరిశీలించనున్నాయి.
ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఒకే జట్టును ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లు బరిలోకి దిగనున్నారు.
తొలి రెండు వన్డేలకు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫిబ్రవరి 11న స్పష్టత రానుంది. కాగా, ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. టాస్ అరగంట ముందుగా అంటే మధ్యాహ్నం 1 గంటలకు జరుగుతుంది.
వన్డే సిరీస్ షెడ్యూల్: తొలి వన్డే: ఫిబ్రవరి 6, మధ్యాహ్నం 1.30 గంటలకు(నాగ్‌పూర్)
రెండో వన్డే: ఫిబ్రవరి 9, మధ్యాహ్నం 1.30 గంటలకు(కటక్మూ
డో వన్డే: ఫిబ్రవరి 12, మధ్యాహ్నం 1.30 గంటలకు(అహ్మదాబాద్)
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ వన్డే టీమ్స్:
భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా
ఇంగ్లండ్ : హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.
స్పోర్ట్స్ 18 ఛానెల్ లో లైవ్..
ఈ సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థకు చెందిన స్పోర్ట్స్ 18 ఛానెల్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన డిస్నీ హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియోసినిమాకు చెందిన వయాకామ్ నెట్‌వర్క్, స్టార్ స్పోర్ట్స్ భాగస్వాములుగా మారడంతో హాట్ స్టార్‌లో ఉచిత ప్రసారాలను నిలిపి వేసారు. ఈ మ్యాచ్‌లను చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సింది. సంబంధిత మొబైల్ నెట్‌వర్క్ రిఛార్జ్ ప్లాన్స్‌తో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా చూడవచ్చు.