పాడి పశువులు మృత్యువాత

పాడి పశువులు మృత్యువాత

బతుకు దెరువు కోల్పోయామన్న రైతు కుమార్
సుమారు లక్షన్నర రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన
ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని గుమ్మడిదల రైతుసంఘం డిమాండ్


గుమ్మడిదల, నవంబర్ 6 ఆంధ్ర ప్రభ : సంగారెడ్డి జిల్లా (Sangareddy district) గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో కుక్కల దాడిలో పాడి పశువులు మృత్యువాత పడ్డ సంఘటన చోటుచేసుకుంది.

గుమ్మడిదల మున్సిపల్ కు చెందిన రైతు సంఘం కుమార్ తండ్రి సంఘం ఐలయ్య వారి పొలంలో ఒక ఆవు, రెండు లేగ‌ దూడలపై రాత్రి వీధికుక్కలు దాడి (dog attack) చేయడంతో మృతిచెందాయన్నారు. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. వీధి కుక్కల నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వ అధికారులు బాధిత రైతుకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Leave a Reply