వికారాబాద్‌లో సామూహిక వందేమాతర గానం

వికారాబాద్ టౌన్, నవంబర్ 7 (ఆంధ్ర ప్రభ ): వందేమాతరం (Vandemataram) 150వ వార్షికోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లు ఎంపీడీఓ వినయ్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం రోజు వికారాబాద్ (Vikarabad) మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో కార్యాలయ సిబ్బందితో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించినట్లు తెలిపారు. వందేమాతరం గేయం 150ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో నవంబర్ 7న ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం (Vandemataram) గేయం ఆలపించాలని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
