హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ నగరానికి యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ హెచ్చరిక జూలై 4వ తేదీ వరకు కొనసాగనుంది.
అయితే, ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా వర్షం ఊపందుకుంది. ఈ వర్ష ప్రభావానికి గురైన ప్రాంతాల్లో బల్కంపేట, బేగంపేట, ఎస్.ఆర్.నగర్, ఆమీర్పెట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాధాపూర్ ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలకు తోడు గాలుల తీవ్రత ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తోంది.
ప్రజలు వర్ష పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనలు పాటించి, అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని సూచించారు.