జీపీఓలేరీ..?

జీపీఓలేరీ..?

-ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల కిష్ట గౌడ్‌


బిక్కనూర్, ఆంధ్రప్రభ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన గ్రామ పాలన అధికారులు ఆయా గ్రామాల్లో కనిపించడం లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ లింగాల కిష్ట గౌడ్ ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో మాట్లాడుతూ గ్రామాల్లో మంచి చెడు చూసుకోవలసిన అధికారులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ పరంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం ఇటీవల గ్రామ పాలన అధికారులను నియమించిందని గుర్తు చేశారు. అట్టి అధికారులు కేటాయించిన గ్రామాల్లో కనిపించడం లేదని చెప్పారు. ప్రస్తుతం వారు మండల కేంద్రాలకి పరిమితం అవుతున్నారని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని గ్రామాల్లో పనిచేసే విధంగా చూడాలని తెలిపారు.

Leave a Reply