వెదుళ్లపల్లిలో అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత..

వెదుళ్లపల్లిలో అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత..

బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ : గోవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వెదుళ్ళపల్లి ఎస్సై భాగ్యరాజ్(Bhagyaraj) హెచ్చరించారు. బాపట్ల మండలంలోని వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్న సమయంలో వెదుళ్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర అనుమానంతో వెళ్తున్న లారీని ఎస్ఐ భాగ్యరాజు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా లారీలో 32 కోడె దూడలు,1 దున్నపోతు మొత్తం 33 పశువుల(a total of 33 cattle)ను గుర్తించి డ్రైవర్ ను వివరణ అడగగా బందర్ నుంచి నెల్లూరు వెళ్తున్నాయి అని చెప్పారు. పశువుల లారీని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల రైలు పేటలోని హిందూ గోశాల తరలించి, మున్సిపాలిటీ కమిషనర్ రఘునాథ్ రెడ్డి కి ఈ మూగజీవాల సంరక్షణకు అప్పచెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భాగ్యరాజ్ తెలిపారు.

Leave a Reply