రైతు కష్టం ధ్వంసం

రైతు కష్టం ధ్వంసం
పత్తి మొక్కలను పీకేసీన అటవీ అధికారులు
చండ్రుగొండ (ఆంధ్రప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని పోకల గూడెం బీట్ లో అటవీ శాఖ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేసారని సమాచారం. సుమారు ఎకరం మేర పత్తి మొక్కలను పీకేసారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో తమను ఆర్థికంగా నష్టపరిచారని ఆరోపించాడు. అయితే ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన వివరణ ప్రకారం.. పోడు కొడుతున్న రైతుకు గతంలో అనేకసార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినా తీరు మారలేదని, పట్టా పొందిన భూమి అయి ఉంటే ఆధారాలు చూపాలన్నారు.
