20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు

20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
మంథని, ఆంధ్రప్రభ : ప్రపంచ పటంలో హైదరాబాద్(Hyderabad)ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో మంత్రి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ.. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు.
