కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం….

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)ను గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) అభ్యర్థి తరపున ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గం ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. ఇతర పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన ఓటర్లకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
