సంగారెడ్డిలో స్టేడియం అభివృద్దికి రూ.10 కోట్లు మంజూరు

హైదరాబాద్,ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణంలో ఉన్న అంబేడ్కర్ స్టేడియం అభివృద్దికి ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉండగా, స్టేడియం అభివృద్దిలో భాగంగా ఇండోర్ స్టేడియంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబ్బడి, హాండ్ బాల్, వాకింగ్ ట్రాక్, లైటింగ్‌తో అథ్లెటిక్ కోర్టులు అభివృద్ది చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
