ఆ విషయంలో.. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

ఆ విషయంలో.. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

కర్నూల్ రూరల్ ప్రతినిధి: (ఆంధ్రప్రభ) : కాలం చెల్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్లు రహదారులు భవనాలు మౌలిక వసతులు సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC JanardhanReddy) అన్నారు. శనివారం కోవెలకుంట్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అన్నారు. ప్రజలకు అభివృద్ధి – సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచడం జరిగిందన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, అర్హత లేని వైసీపీ నేతలు నేడు విమర్శలు చేస్తున్నారన్నారు.

దేశంలో సంక్షేమ పథకాలు (Welfare schemes) బాగా అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని పేర్కొన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో అభివృద్ధిమయం చేస్తున్నామని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతుందని తెలిపారు. రూ. 2 వేల నుంచి 3 వేలకు ఒకేసారి పెన్షన్ పెంచామని అన్నారు. రాజకీయం కోసం విమర్శలు చేయడం తప్పా విధానపరంగా మాట్లాడే ధైర్యం వైసీపీకి లేదన్నారు. రాబోయే రోజుల్లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply