ఉమామహేశ్వర ఆలయం మూసివేత

విరిగి పడుతున్న కొండ చరియలు
ప్రమాదపరితంగా జలపాతాలు
భక్తులు సహకరించాలి
ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి

అచ్చంపేట అక్టోబర్ 29, (ఆంధ్రప్రభ) : గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైల ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కొండపైన, కొండకింద మట్టిచరియలు విరిగి పడడంతో భక్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో ఆలయ చైర్మన్ బీర మాధవ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది సంయుక్తంగా భక్తులను విజ్ఞప్తి చేస్తూ, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఆలయానికి రావడం మానుకోవాలని కోరారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా మార్గాలు దెబ్బతినడంతో, కొండ ప్రాంతాల్లో భూసార చలనం చోటుచేసుకుంటోందని, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైర్మన్ మాధవ రెడ్డి భక్తుల భద్రత అత్యంత ప్రాధాన్యమని, వర్షాలు తగ్గిన తర్వాత ఆలయ దర్శనానికి సంబంధించిన సమాచారం అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

Leave a Reply