కర్నూలు రిపోర్ట్ ఇదే..

కర్నూలు రిపోర్ట్ ఇదే..

కర్నూలు బ్యూరో, అక్టోబర్ 29, ఆంధ్రప్రభ : జిల్లాలో మంగళ, బుధవారం ఉదయం వరకు పలు మండలాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Moderate rains) కురిశాయి. ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం, మొత్తం జిల్లా వర్షపాతం 278.8 మిల్లీమీటర్లు కాగా, జిల్లా సగటు వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలో మొత్తం 23 మండలాల్లో (23 zones) వర్షపాతం నమోదయిందని జిల్లా ప్రణాళికాధికారి ( సిపిఓ) తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. ఓర్వకల్ మండలంలో అత్యధికంగా 57.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోసిగి మండలంలో అత్యల్పంగా 0.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.

అదే సమయంలో, కర్నూలు రూరల్ (37.6 మి.మీ), కర్నూలు అర్బన్ (34.2 మి.మీ), వెల్దుర్తి (23.0 మి.మీ), గూడూరు (20.6 మి.మీ), కృష్ణగిరి (22.6 మి.మీ), కోడుమూరు (25.8 మి.మీ) మండలాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక ఎమ్మిగనూరు (48.0 మి.మీ), సి. బేలగల్ (28.8 మి.మీ), గోనెగండ్ల (17.4 మి.మీ), నందవరం (22.4 మి.మీ), పత్తికొండ (15.4 మి.మీ), మంత్రాలయం (11.8 మి.మీ) మండలాల్లో కూడా వర్షం కురిసింది. మిగిలిన కొన్ని మండలాల్లో స్వల్ప వర్షపాతం మాత్రమే నమోదైంది. కొన్ని మండలాల్లో వర్షం కురవలేదు. జిల్లా మొత్తం వర్షపాతం: 278.8 మి.మీ. జిల్లా సగటు వర్షపాతం: 10.7 మి.మీ. వర్షపాతం నమోదైన మండలాలు: 23.. అత్యధిక వర్షం: ఓర్వకల్ – 57.8 మి.మీ. నమోదు కాగా అత్యల్ప వర్షం: కోసిగి – 0.2 మి.మీగా నమోదైంది.

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలి..
మొంథా తుపాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను వేగంగా అందించేందుకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి తెలిపారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ ఈ నెల 31వ తేదీ వరకు రోజుకు 24 గంటలు ప్రజలకు సేవలు అందించనుందని తెలిపారు. దీని కోసం ఆరుగురు సిబ్బందిని మూడు షిఫ్టులుగా విధుల్లో నియమించినట్లు చెప్పారు. ప్రజలకు తుపాను కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయం కోసం 9885050659, 9603944141, 8247569269, 9494734090, 9014581332, 9848498816 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయంలోనూ కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసినట్లు సీఈఓ నాసరరెడ్డి వెల్లడించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం కాబట్టి ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులు సూచించారు.

Leave a Reply