ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ల ధర్నా…

ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ల ధర్నా…

  • ఆళ్లగడ్డ డిపోలో ఆందోళన

ఆంధ్రప్రభ, ఆళ్లగడ్డ ( నంద్యాల జిల్లా) : కడప జిల్లా (Kadapa District) దువ్వూరు సమీపంలో ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ పై జరిగిన దాడికి నిరసనగా ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు ఆగ్రహంతో విధులను బహిష్కరించారు. ధర్నా నిర్వహించారు. బస్సు డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తులపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

బస్సు డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ డిపో (Allagadda Depot) లోని 25 హైర్ బస్సుల డ్రైవర్లు క్లీనర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అద్దె బస్ డ్రైవర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆళ్లగడ్డ తోపాటు నంద్యాల, కోవెలకుంట్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, మైదుకూరు, కడప, రాజంపేట, జమ్మలమడుగు టీఎస్ఆర్డీసీ హైర్ బస్ ల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించటంతో, విధులకు వెళ్లే ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటు స్థానిక ప్రజలు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్ డ్రైవర్ల నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.