హుటాహుటిన పైప్ లైన్ మరమ్మతులు..

  • తీరిన 8 రోజుల దాహార్తి
  • ఆంధ్రప్రభకు తూపల్లి వందనం

శ్రీ సత్యసాయి బ్యూరో , ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని తూపల్లి దళితవాడలో తలెత్తిన తాగునీటి సమస్య పరిష్కారమైంది.ఈ సమస్యపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే అధికారులు చలించిపోయారు. స్పందించారు.

పంచాయతీ కార్యదర్శి రామప్ప నాయుడు హుటాహుటిన కార్మికులతో తరలివెళ్లారు. గ్రామంలో పైపుల మరమ్మతులు పూర్తి చేశారు. తాగునీటి సరఫరా ను పునరుద్ధరించారు. పైప్ లైన్ మరమ్మతుల ఫోటోలను ఆంధ్రప్రభ కు పంపించారు. తూపల్లి గ్రామస్తులు ఆంధ్రప్రభ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply