కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు సేవలు..

  • ఖాతాదారుల విశ్వాసమే ముఖ్యం…మరిన్ని బ్రాంచిలు ప్రారంభించి నేరుగా సేవలు అందించాలి..
  • విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్…
  • విజయవాడలో కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్
  • 35వ నూతన బ్రాంచి లాంచనంగా ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్.
  • పాల్గొన్న‌ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు,
  • కె.డి.సి.సి.బి చైర్మ‌న్ నెట్టెం ర‌ఘురామ్,
  • స్వ‌చ్ఛఆంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్…


ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఖాతాదారుల విశ్వాసమే బ్యాంకులకు ముఖ్యమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ (Kesineni Sivanath) పేర్కొన్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసినది. కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ 35వ బ్రాంచిని విజయవాడ ఎంపీ (Vijayawada MP) కేశినేని శివనాథ్ బుధ‌వారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కేడీసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త బ్రాంచి కార్యకలాపాలను ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్ స్వయంగా బ్యాంకులోని క్యాష్ కౌంటర్, లాకర్లను ప్రారంభించి సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకు (Kanaka Mahalakshmi Bank) ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ప్రజల నమ్మకాన్ని మరింత పెంచడంతోపాటు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాగే ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొన్న కనకమహాలక్ష్మి బ్యాంకు మరిన్ని బ్రాంచిలు ప్రారంభించి నేరుగా సేవలు అందించాలని ఎంపీ సూచించారు.

Leave a Reply