మంత్రి లోకేశ్‌కు దుర్గగుడి ఆహ్వానం

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో): దసరా ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు(Lokesh Babu)ను శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయం అర్చక బృందం, దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్(Sheena Naik) ఆహ్వానించారు. దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రాన్ని మంత్రికి అందజేశారు. ప్రస్తుతం దసరా ఉత్సవ ఏర్పాట్ల పురోగతిని వివరించారు.
