బంగారం ప్రియులకు శుభవార్త..
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం ధర(gold price) రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. మునుపు ఎన్నడూ లేనంతగా గోల్డ్ ధర ఎక్కువ అవుతుంది. గోల్డ్ రేట్.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110,650 లకి చేరింది. కాగా 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.101,429లకి చేరింది. సోమవారం కంటే బంగారం ధర ఈరోజు రూ.170లు తగ్గింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.129,350ఉంది. నిన్నటి కంటే వెండి ధర రూ.370 తగ్గింది.
భారత దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110,630ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,411గా ఉంది. వెండి కేజీ(silver kg) ధర రూ.129,320గా ఉంది.
విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110,630ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,411గా ఉంది. వెండి కేజీ ధర రూ.129,320గాఉంది.
ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగార ధర 110,260, 22 క్యారెట్ల ధర రూ.101,072లుగా ఉంది. వెండి కిలో ధర రూ.128,900లుగా ఉంది.
ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగార ధర110,450, 22 క్యారెట్ల ధర రూ.101,246లుగా ఉంది. వెండి కిలో ధర రూ.129,120లుగా ఉంది.
చెన్నై(Chennai)లో 24క్యారెట్ల బంగారం ధర రూ.110,770ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,539 గా ఉంది. వెండి కిలో ధర రూ.129,500గా ఉంది.
