నిర్వాసితుల రాస్తారోకో..

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్ర‌ప్ర‌భ : త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం రైతులు (Farmers) డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు దేవిరెడ్డి బంగ్లా గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిర్వాసితులు రాస్తారోకో చేశారు. పాత అలైన్మెంట్ ప్రకారం రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ నాయకులకు ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా రోడ్డు అలైన్మెంట్ మారుస్తున్నారని రైతులు (Farmers) ఆవేద‌న చెందుతున్నారు.