దేవాదాయ ఆస్తులను పరిరక్షిస్తాం

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో): రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్(Keshineni Shivanath, Member of Parliament from Vijayawada) అన్నారు. బెజవాడ(Bejwada)కు మరింత గుర్తింపు తెచ్చే లక్ష్యంతోనే విజయవాడ ఉత్సవ్(Vijayawada Utsav) నిర్వహిస్తున్నామని వివరించారు. మచిలీపట్నం గొడుగుపేటలోని భూలీల సమేత వెంకటేశ్వర స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra), ఎంపీ కేశినేని శివనాథ్(MP Keshineni Sivanath), ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ(RTC Chairman Konakalla Narayana), స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram), సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ సభ్యులు ముత్తవరపు మురళీ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.

సెప్టెంబర్ 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్(Utsav Exhibition) కోసం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి(Lord Venkateswara Swamy) ఆలయానికి చెందిన 40 ఎకరాల భూమిని సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ లీజుకు తీసుకుంది. 40 ఎకరాల భూమిని సుమారు 56 రోజుల వినియోగిస్తుంది. ఈ ఒప్పందం మేరకు రూ.45 లక్షల చెక్కు ను వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ కమిటీకి అందజేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా తో మాట్లాడుతూ విజయవాడ సంస్కృతి(culture), కళల(arts)కు ప్రపంచ(the world) వ్యాప్తంగా గుర్తింపు తెచ్చే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తునట్టు తెలిపారు. సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా విజయవాడను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. దసరా ఉత్సవాలు అంటే అందరికీ మైసూర్(Mysore) గుర్తొస్తుందని,.. అదే రీతిలో విజయవాడలో దసరా ఉత్సవాలను నిర్వహించాలని భావించినట్లు ప్రకటించారు.
ఆదాయాన్ని పెంచుతాం

దేవాలయ స్థలం విషయంలో అపోహలు నెలకొనడం బాధాకరమన్న అయన ఆలయ కమిటీ సభ్యులందరితో చర్చించిన తర్వాతే ఆలయానికి ఆదాయం కల్పించే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఆలయ భూముల వినియోగానికి గాను ఆలయానికి రూ.45 లక్షలు, రైతులకు రూ.15 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. 56 రోజుల పాటు మాత్రమే వినియోగించుకునేలా ఆలయ కమిటీతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. వెంకటేశ్వర స్వామి ఆస్తుల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.ఈ ఆదాయంతో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా ప్రజలు, నాయకులు విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేసినట్లుగా.. విజయవాడ ఉత్సవ్ ను మరింత సరికొత్త గా నిర్వహిద్దామన్నారు.

వేసవి సెలవుల్లో బందరులో బీచ్ ఫెస్టివల్.. దసరా సెలవుల్లో విజయవాడ ఫెస్టివల్ నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. దేవాలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా కేసినేని శివనాధ్ మాట ఇచ్చారు. విజయవాడ ఉత్సవ్ విజయవంతానికి ఆ దేవ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు
